నాస్తికోన్మాదం /-

ఆ ఇమామ్ తన ప్రక్కన కుక్క పిల్లో, పంది పిల్లో నిలబడ్డాన్ని సహించగలడా? అన్న పనికిమాలిన ప్రశ్న వెయ్యటం దేనికి?

ఆ ఇమామ్ ఓ పేదవాడినో, సమాజం అంటరానివాడిగా చూసే ఓ వెనకబడిన కులపుటోడినో, ఓ బలహీనుణ్ణో తన ప్రక్కన నిలబడ్డాన్ని సహించగలడా? అని ప్రశ్నించి ఉంటే ఎంత అందంగా ఉండేది?

ఎందుకంటే మసీదు నుండి అజాన్ పిలుపు విన్న వెంటనే ఆ మసీదు బయట చెప్పులు కుట్టుకునే వాడైనా, రిక్షా లాక్కునే పుల్లరైనా, బెంజ్ కార్లో తిరిగే కోటీశ్వరుడైనా, కటిక బీదవాడైనా, బలహీనుడైనా, వెనుకబడినవాడైనా అందరూ కలిసి ఒకే వరుసలో నిలబడిపోయి ఒకే దైవాన్ని ఆరాధించే సుందరమైన అపురూప దృశ్యం ఎక్కడ కనపడుతుంది?

మసీదులో నమాజ్ చదివించే ఇమామ్ తన ప్రక్కన నిలబడింది బీదవాడా, బలహీనుడా, తక్కువ స్థాయి వాడా, ఎక్కువ స్థాయి వాడా, డబ్బున్నవాడా, బీదవాడా అన్న తారతమ్యాలు అస్సలు చూడడు. తన ప్రక్కన ఎవరొచ్చి నిలబడినా ఉచ్చనీచ బేధ భావాలు లేకుండా నమాజ్ చదివించటమే అతని విధి.

ఇది కదా అసలు గుర్తించాల్సింది? ఓ కుక్క పిల్లో పంది పిల్లో నిలబడితే ఆ ఇమామ్ వాటిని ముద్దాడగలడా? సహించగలడా లాంటి చిల్లర చవకబారు ప్రశ్నలు అడగటం దేనికి?

దళితులు, వెనుకబడిన వర్గాల వారు కులం పేరుతో దేవాలయాల్లోకి ప్రవేశం నిషిద్ధం చేయబడుతున్న నేపథ్యంలో.. మసీదులో దైవారాధనకు ప్రవేశించే వ్యక్తి ఎవరైనా కానీ అతని హోదా, అంతస్తులు చూడకుండా అతన్ని సాదరంగా ఆహ్వానించి అతన్ని అందరితో పాటు ఒకే వరుసలో కలుపుకుని ప్రార్ధన చేసే ఆరాధనాలయం మసీదు. ఇది కదా అసలు గమనించాల్సింది.

అయినా ఆరాధనాలయాల్లో కుక్క పిల్లలు, పందులు ఎందుకు తిరుగుతుంటాయి? ఇంత చిన్న లాజిక్ ఇతను ఎలా మిస్సయ్యాడు? బహుశా గౌరవనీయులైన ఈయన గారి ఇంట్లో అవి తిగుతుంటాయేమో కాబోలు!

నిజంగా ఆ ఇమామ్ ప్రక్కన ఓ కుక్క పిల్లో పంది పిల్లో వచ్చి నిలబడినా ఆ ఇమామ్ నమాజ్ నుండి వైదోలగిపోయేదేమి ఉండదు.

ఎవరెలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి లాంటి పనికిమాలిన సలహాలు ఇస్తూ దిక్కుమాలిన గభ్యుదయాన్ని ప్రదర్శించే ముందు.. అన్ని జీవులకు ‘కామన్ యాన్సిస్టర్’ ఒక్కటే అన్న డార్విన్ సూత్రాన్ని బట్టి నా తోటి జీవులేకదా అని భావించి ఓ ఊరకుక్కనో, వీధిలో తిరిగే నాటు పందినో ఈయన గారు తన బెడ్ పై పక్కలో పడుకోబెట్టుకుని ముద్దాడుతూ ఆ ఆదర్శన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే ఇంకా బాగుండును కదా!

నాస్తికత్వం అన్న ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రానా ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా విమర్శించటానికి లైసెన్స్ దొరికేసినట్టు కాదు. ఎలా పడితే అలా గుడ్డిగా విమర్శిస్తూ నాస్తికోన్మాదాన్ని ప్రదర్శిస్తే సభ్యసమాజం హర్షించదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *