శూన్యం (Nothing)లో నుండి ధూళి రేణువులు కొన్ని యాక్సిడెంటల్ గా బయలుదేరి వాటిలో కొన్ని ఇటుకలుగా, సిమ్మెంటుగా, ఇసుకగా రూపాంతరం చెంది అవన్నీ ఓ చోట పోగైపోయాయి.
ఆ తరువాత ఇటుకలు తమ స్వంత ఇంటెలిజెన్స్ తో కొన్ని నియమాలను తయారుచేసుకుని అవి ఎంతెంత పరిమాణంలో ఉండాలో ఏయే కొలతల్లో పేర్చబడాలో నిర్ణయించుకుని, ఒకదానిపై ఒకటి ఎంతెంత దూరంలో ఏ యే క్రమంలో ఉండాలో ఆలోచించుకుని, సిమ్మెంటులో ఇసుక ఎన్నేసి పాళ్లలో కలుపబడాలో వాటికవే డిసైడ్ చేసుకుని కొన్ని గోడలుగా పై కప్పుగా నిర్మించబడి దానికదే ఇంటి నిర్మాణం (Something) అన్నది యాక్సిడెంటల్ గా జరిగిపోయిన తరువాత…
ఆ ఇంటి గోడపై ఏమీ లేని స్థితి (Nothing) నుండి కొన్ని రంగులు వాటికవే పైకి ఉబికి, అవన్నీ తెలివిగా ఓ క్రమంలో పేరుకుపోవటం మొదలయ్యాయి. అలా… అలా… ఆ రంగులన్నీ కొన్ని ఆకారాల్లో వాటికవే డిజైన్ చేసుకోవటం మొదలెట్టాయి. ఏ రంగు తరువాత ఏ రంగు పూయబడాలి, ఏది ఎంత పరిమాణంలో ఉండాలి, ఏది ఏ నియమం ప్రకారం ఎంతెంత పాళ్లలో కలుపబడాలి వగైరా విషయాలన్నీ ఆ రకరకాల రంగులే తెలిగా నిర్ణయించుకున్న తరువాత ఈ క్రింది విధమైన ఓ గొప్ప ఆర్ట్ (Something) గా రూపొందటం జరిగిందన్న మాట!
****
“మీ మైండ్ ఏమైనా దొబ్బిందా?” ఈ క్రింది పేయింటింగ్ తయారైంది ఏ బోడీ లేని (Nothing) స్థితి నుండి కాదు దాన్ని గీసింది “లియోనార్డో డావెన్సి” అనే ఆర్టిస్టు! ఏ ఆర్టిస్ట్ లేకుండా ఓ పేయింటింగ్ దానికదే తయారవుతుందని ఏ పిచ్చాసుపత్రిలో నేర్పారు మీకు?
ఏమీ లేని స్థితి (Nothing) నుండి పుట్టుకొచ్చిన “పాదార్థానికి (Matter కు) తెలివితేటలుండటమేంటి?
ఏ రూపంలో ఏ క్రమంలో ఏ నియమం ప్రకారం ఏ ఆకారంలో ఎంతెంత పరిమాణంలో ఏ విధంగా రూపుదిద్దుకోవాలో స్వతహాగా నిర్ణయించుకోటానికి సృష్టి “పదార్థం (Matter)” ఏమైనా స్వంత తెలివితేటలు కలిగి ఉందా?
&%^#%)(@$X
…. “ఇదిగో ఇలాంటి లాజిక్కులే మాట్లాడవద్దు అనేది! ….
ఆల్రెడీ మా నాస్తిక్ సంఘ సభ్యులంతా కలిసి ” Nothing నుండి Something వచ్చిందని ఫిక్స్ అయిపోయారంతే…
వాళ్లు చెప్పిందే ఇక ఫైనల్… ఆలోచించుకోటాల్లేవ్…
ఈ క్రింది మోనాలిసా ఆర్ట్ ను ఏ “లియోనార్డ్ డావెన్సి” వెయ్యలేదు!
ఒకడు సృష్టించటం, డిజైన్ చెయ్యటం, కంట్రోల్ చెయ్యటం అంటూ ఏది ఉండదు. అంతా బోడి, బొంగు… బ్లా… బ్లా … ప్రతీదీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతే!
అలా ప్రతీ ఆర్ట్ వెనుక ప్రతీ చైతన్య వంతమైన, క్లిష్టతరమైన వ్యవస్థ వెనుక ఒక క్రియేటర్ తాలూకు మేధస్సు ఉండి దాన్ని డిజైన్ చేసి, ఆపరేట్ చేస్తూ కంట్రోల్ చేస్తుంటుంది… బ్లా… బ్లా… బ్లా… లాంటి పనికి మాలిన ఫిలాసఫీలు చెప్పటం పనికిరావు అంతే!
కాబట్టి ఈ క్రింది మోనాలిసా ఆర్ట్ అన్నది “Nothing” నుండి దానికదే రూపుదిద్దుకుని తయారైన “Something” ఆర్ట్ అన్నమాట! దీనినే “Nothing నుండి Something” తయారవటం అందురన్న మాట!
ఈ ఒక్క ఆర్ట్ మాత్రమే కాదు…
ఈ విశ్వాన్ని విశ్వమే Nothing నుండి తనకు తానుగా తయారు చేసుకుందన్న మాట!
ఈ రకమైన వాదనకు కొందరు పెట్టుకున్న ముద్దు పేరు “హేతువాదం”
ఈ రకమైన “హేతువాదం” చెయ్యటానికి ఆ కొందరు ఎన్నుకున్న మార్గం “నాస్తికత్వం”
Nothing నుండి Something అంటే ఇదన్నమాట…
