సృష్టి, సృష్టికర్త… బ్లా బ్లా బ్లా…

సమన్వయం (Coordination), సమతూకం (Balance), క్రమం (Order), క్రమబద్ధత (Discipline), కచ్చితమైన గణిత నియమాలు (Mathematical rules) తో పనిచేసే చిన్న వైండింగ్ మోటార్ నుండి రాకెట్ వరకు ఏదైనా ఒక క్లిష్టతరమైన వ్యవస్థ (System) తయారవ్వటం, అది పనిచెయ్యటం అన్నది మానవ మేధస్సు (Human intelligence) లేనిదే సాధ్యం కాదన్నది ఒక్క మతి చెడిపోయిన పిచ్చివాళ్లు తప్ప కాస్తో కూస్తో ఆలోచన ఉన్న ప్రతీ ఆరోగ్యవంతుడైన మనిషీ ఒప్పుకు తీరాల్సిన విషయమే.

ఈ నియమం ప్రకారం.. ఎంతో సమన్వయం, సమతూకం, క్రమం, క్రమబద్ధతతో నడుపబడుతున్న విశ్వవ్యవస్థను సృష్టించి, దాన్ని అదుపు చేస్తున్న ఒక “ఇన్విజిబుల్ ఇంటెలిజెన్స్ (అగోచర మేధస్సు)” ఉందని చెప్పటం మటుకు నాస్తిక్ మెతావుల దృష్టిలో మటుకు పరమ అజ్ఞానం!

ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వానికి బయట ఏ సృష్టికర్తా ఉండి దాన్ని తయారు చెయ్యనూ లేదు, దాన్ని నడపటమూ లేదు అన్నది నాస్తిక మెతావులు చేసే వాదన. అంటే వారి ప్రకారం.. ఈ విశ్వాన్ని విశ్వమే సృష్టించుకుందన్న మాట! విశ్వమే తన స్వంత తెలివితేటలతో తనకు తానుగా నడుపుకుంటుంది. ఈ వాదనకు నాస్తిక్ మెతావులు పెట్టుకున్న ముద్దు పేరు “హేతువాదం”.

సృష్టికర్త లేడని నిరూపించటం చేతకాని నాస్తికులు!

విశ్వం యాక్సిడెంటల్ గా తయారైపోయింది, విశ్వానికి బయట ఏ సృష్టికర్త తాలూకు మేధస్సూ లేదు! విశ్వం దానికదే తయారైపోయి అందులో వ్యవస్థలన్నీ “సిరీస్ ఆఫ్ ఈవెంట్స్”లో భాగంగా వాటికవే అలా అలా పనిచేస్తూ పోతున్నాయంతే!

ఈ సృష్టికి బయట ఓ సృష్టికర్త ఉన్నాడని నమ్మటం ఓ ఇన్విజిబుల్ పవర్ ఏదో నియంత్రిస్తుందని నమ్మటం బ్లా బ్లా బ్లా… అంటూ నిర్లక్ష్యపు ధోరణితో కూడిన పనికిమాలిన కొటేషన్లు ఇచ్చే నాస్తికులు పోనీ ఈ విశ్వానికి స్వంత తెలివితేటలు ఉన్నాయని, బయట నుండి ఏ మేధస్సూ దాన్ని కంట్రోల్ చెయ్యటం లేదని నిరూపణ చేస్తే ఓ పనైపోతుంది కదా!

కాస్త వివరంగా చెప్పాలంటే…

“విశ్వంలో రాళ్లు, రప్పలు, మట్టి, దుమ్ము, ధూళితో తయారైన నక్షత్రాలు, గ్రహాలన్నీ వాటంతట అవే తమ స్వంత తెలివితేటలతో తమకు తాముగా ఏయే ఆకారాల్లో ఎంతెంత పరిమాణాల్లో ఉండాలో డిజైన్ చేసుకుని… ఏ గోళంపై విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండాలి, ఏ గోళంపై విపరీతమైన చల్లదనం ఉండాలి, ఏ గోళంపై ఈ రెండూ సమతూకంతో ఉండి జీవులు బ్రతకటానికి అనువుగా ప్రకృతి ఉండాలి అన్నది తమ స్వంత మేధస్సుతో తామే నిర్ణయించుకుని తమకు తామే విశ్వంలో కక్ష్యలను ఏర్పర్చుకుని వాటి మధ్య పటిష్టమైన గణిత నియమాలు ఏర్పర్చుకుని ఆయా గ్రహాలన్నీ తమ స్వంత తెలివితేటలతో క్రమబద్ధంగా పనిచేస్తున్నాయని” ఈ నాస్తిక మేతావులు సైంటిఫిగ్గా నిరూపించి సృష్టికర్త లేడని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా.

అలా ఎందుకు నిరూపించలేరు?

అంటే.. అది ఎప్పటికీ ప్రూవ్ కాదు కాబట్టి! అలాంటి వాదన చెయ్యటం, అలాంటి ప్రయోగానికి పూనుకోవటం అజ్ఞానం అవుతుందన్నది వాళ్లకు కూడా తెలుసు కాబట్టి.

ఒకవేళ విశ్వానికి తనకు తానుగా సృష్టించుకుని, నియంత్రించుకునే స్వంత తెలివితేటలు లేవు అంటే… బయట నుండి ఏదో ఒక అగోచర శక్తి ఉనికిలో ఉంటూ ఈ విశ్వాన్ని సృష్టించి, దాన్ని నియంత్రిస్తుందని ఒప్పుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ సృష్టికర్త ఉండాల్సిన అవసరమే లేదంటే… “అయితే విశ్వ పదార్థానికి తన్ను తాను సృష్టించుకుని, నియంత్రించుకునే స్వంత తెలివితేటలు ఉన్నాయని ప్రూవ్ చేసి, సృష్టికర్త లేడని మీరు ఎందుకు నిరూపించలేరు?” అన్న ప్రశ్న దగ్గరకే వాదన వచ్చి నిలబడుతుంది. ఈ చిక్కుముడిని విప్పటం నాస్తికులకు ప్రళయం వరకు సాధ్యం కాని పని.

అసలు మీరు ఈ విశ్వం ఉనికిలోకి రావటం, నడుపబడటం వెనుక ఓ మేధస్సు పనిచేస్తుందని ఎందుకు వాదిస్తున్నారు? అని నన్ను ప్రశ్నిస్తే…  ఎంతో క్రమబద్ధతతో సమన్వయం, సమతుల్యతలతో నడుపబడే ఒక క్లిష్టతరమైన వ్యవస్థ ఉనికిలోకి రావటం, అది నియంత్రించబడటం అన్నది ఒక మేధస్సు (Intelligence) లేనిదే సాధ్యం కాదన్నది కాస్తో కూస్తో ఆలోచన ఉన్న ఏ ఆరోగ్యవంతుడైన మనిషైనా ఒప్పుకుతీరాల్సిన విషయమే కాబట్టి.. అన్నదే నా సమాధానం.

***

చివరిగా…

విగ్రహాల వల్లనో, పాము పుట్టల్లో పాలుపోయటం వల్లనో, సమాధుల్ని పూజించటం వల్లనో, బాబాలు, స్వామీజీలను నమ్మటం వల్లనో మంచి జరుగుతుందని నమ్మటం కొందరు ఆస్తికుల్లో ఉండే మూఢనమ్మకమైతే… విశ్వవ్యవస్థ ఏ మేధస్సూ లేకుండానే దానికదే ఉనికిలోకి వచ్చి దానికదే క్రమబద్ధంగా పనిచేస్తూపోతుందని నమ్మటం నాస్తికుల్లో ఉండే పరమ మూఢనమ్మకం.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *