నాస్తికుల పరమ సోది ఏమిటంటే…

ఏమీ లేని స్థితి నుండి అన్నీ వాటంతట అవే సృష్టించబడిపోయాయన్నది …

ఏ నిపుణుడైన సృష్టికర్తా లేకుండానే విశ్వంలో గ్రహాలన్నీ తమకు తామే తెలివిగా కంట్రోల్ చేసుకుంటున్నాయన్నది…

ఏ శక్తిమంతుడూ లేకుండానే విశ్వం తనకు తానుగా గొప్ప గురుత్వాకర్షణ శక్తిని సృష్టించేసుకుందన్నది…

ఏ నిర్వాహకుడూ లేకుండానే విశ్వం తనకు తానే నిర్దిష్టమైన సమతూల్యత ను ఏర్పర్చేసుకుందన్నది…

ఏ గొప్ప మేధావంతుడూ లేకుండానే సమస్త సృష్టి పటిష్ట భౌతిక, గణిత, రసాయన సూత్రాలను దానికదే ఏర్పర్చేసుకుని దానికదే నిర్వహించేసుకుంటుందన్నది…

ఏ కళాకారుడూ లేకుండానే రంగురంగులతో కూడిన గొప్ప కళాఖండం లాంటి అందమైన ప్రకృతి తనకు తానే రూపొందించేసుకుందన్నది…

వీళ్లే ప్రతీ టెక్నలాజి వెనుక కచ్చితంగా ఒక మేధా శక్తి ఉండి తీరాలని … సృష్టిలో జరిగే ప్రతీ చర్య వెనుక ఒక కారణం ఉంటుందని…లాజిక్కులు చెబుతూనే ఇదంతా హుళుక్కేనని ఈ మహత్తరమైన సృష్టి వెనుక ఏ మేధా లేదని వాదిస్తుంటారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *