ఇంతకంటే… కోతులమని డిక్లేర్ చేసుకోవటమే బెటరా?

ధర్మాన్ని ఆచరించటం, ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని నమ్మటం ఆయన ఆదేశాలకు లోబడి నైతికంగా ప్రవర్తిస్తూ జీవించటం, చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ.. మంచి ఆలోచనల ప్రకారం నడుచుకోవటం, ఆ సృష్టికర్తకు భయపడి న్యాయం వైపు నిలబడటం అన్యాయంగా అక్రమ మార్గాల్లో వచ్చే లక్షల కోట్ల రాబడిని వదులుకోవటం, దాని వల్ల కలిగే అమితమైన సుఖాలను త్యజించటం, న్యాయంగా నైతికంగా జీవిస్తూ చివరకు ఓ మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఈ ప్రపంచాన్ని ఏదో రోజు విడిచిపెట్టి వెళ్లిపోవటం కన్నా.. నాస్తిక్ అభ్యుదయవాదులు చూపించే గొప్ప ఆల్టర్నేటివివ్ ఆప్షన్..

ఎంతో క్రమబద్ధంగా పటిష్టంగా నియంత్రించబడే సృష్టి ఉందంటే దానిని నియంత్రించే ఒక సృష్టికర్త ఉంటాడు అన్న బేసిక్ లాజిక్ ని ప్రక్కన పెట్టేసి.. ఈ సృష్టంతా ఏదో గాలివాటంగా అలా ఏర్పడిపోయి దానికదే నియంత్రించబడుతుంది అంతే.. తప్పితే ఏ సృష్టికర్తా లేడు.. ఇదంతా హుళుక్కే అని వాదిస్తూ.. పైగా అలా వాదించటాన్నే గొప్ప హేతువాదంగా, మాహాజ్ఞానంగా, అభ్యుదయవాదంగా ఫీలైపోయి..

మనిషిని సైతం ఎవరూ సృష్టించలేదు వేల సంవత్సరాల నుండి కొన్ని కోతి జాతులే కాలక్రమేణా పరిణామం చెందుతూ మనుషులుగా రూపాంతరం చెంది.. ఇప్పుడు మనిషి గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో కూర్చుని సాఫ్ట్ వేర్ డెవలపర్ స్థాయికి వచ్చాడని గుడ్డిగా నమ్మేసి..
మనిషి సృష్టికర్తను నమ్ముకోవటం, ఎవరో సృష్టికర్త ఉనికిలో ఉన్నాడని విశ్వసించి.. చెడు ఆలోచనలను పంటి క్రింద బిగపట్టుకుని బలవంతంగానైనా మంచినే ఆచరిస్తూ నైతికంగా నడుచునే బ్రతుకు బ్రతికే కన్నా శుభ్రంగా మనుషులంతా ఒకప్పటి కోతులని డిక్లేర్ చేసేసుకుంటే.. ఏ బాదరబందీ ఉండదన్న మాట.

అయినా నన్ను ఒకడు సృష్టించాడు.. ఆయన నన్ను నియంత్రిస్తున్నాడు ఆయన నేను ఎలా జీవించాలో కొన్ని ఆదేశాలిచాడు ఆ ఆదేశాలకు నేను లోబడాలి.. లోబడి చెడులను నియంత్రించుకుంటూ మంచిగా జీవించాలి లేదంటే ఒకరోజు ఆయన సమక్షంలో నా పనులకు లెక్క తీసుకుంటాడు.. అన్న భయాలున్నప్పుడే కదా జీవితం విషయంలో ఒక “బాధ్యత” లేక రెస్పాన్సిబిలిటీ అనే అదనపు తలనొప్పి!

దాని కంటే మన నాస్తిక్ అభ్యుదయ వాదులు చెబుతున్నట్టు.. షార్ట్ కట్టులో ఈ సృష్టికి బోడి ఏ సృష్టికర్తా లేడని మనకు మనమే డిసైడ్ అయిపోయి.. మనం కేవలం ఒకప్పటి కోతులమని డిక్లేర్ చేసేసుకుంటే.. ఏ తలనొప్పీ ఉండదు మంచీ-చెడులన్నవాటితో సంబంధం లేకుండా హ్యాపీగా కోతుల్లా బతికెయ్యొచ్చు.. అసలు మనం ఒకప్పటి కోతులం మాత్రమే.. ఈ సమస్త విశ్వానికి ఏ సృష్టికర్తా లేడూ నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అగత్యం లేదని బలవంతంగా నమ్మినప్పుడు..

ఒకడికి భయపడి చెడును చెడుగా గుర్తించాల్సిన పనేముంటుంది? పెళ్లిళ్లు, సంసారాలు కుడా వేస్ట్.. ఎందుకంటే మనుషులంతా ఎలాగూ ఒకప్పటి కోతులే కాబట్టి సెక్స్ ఆలోచనలు వస్తే టిఫిన్ తినేహేసి ఆకలి తీర్చుకున్నంత సింపుల్ గా స్త్రీ,పురుషులు తమ కామ కోరికలు తీర్చేసుకోవాలి. దానికి వ్యభిచారం, అశ్లీల్లత, అనాగరికత లాంటి పనికి మాలిన పదాలు తగిలించకూడదు. ఒకప్పటి కోతులకు అలాంటి మోరల్ ఫిలింగ్స్ ఉండేవి కావు. పైగా అలా మోరల్ గా ఫీలవటం ఒకప్పటి మన తాత ముత్తాతలైన కోతులను అవమానపరచటమే అవుతుంది.

మనకు కలిసొచ్చేదుంటే తోటివ్యక్తికి అన్యాయం చెయ్యటానికైనా వెనుకాడాల్సిన పనేముంటుంది? అయినా ఒకడు మన చేతిలో అన్యాయానికి గురైనా, చచ్చిపోయినా మనం రహస్యంగా చేసే కుట్రలకు రేపన్నరోజున ఒకడి ముందు నిలబడి మన పనుల విషయంలో సమాధానం చెప్పుకోవాలన్న భయం బాధ్యతల్లాంటి తలనొప్పులు ఎలాగూ లేవు కదా.. ఎలాగూ ఒకప్పటి కోతులమే.. ఆ మాత్రం కోతి పనులు సహజంగా చెయ్యటంలో తప్పు లేదాయే!
అయినా మనం చేసే పనులకు మంచీ-చెడు, మన స్వలాభం కోసం సంపాదించుకునే దానికి నీతి-న్యాయం, శారీరక సుఖానికి వ్యభిచారం అనే దిక్కుమాలిన పేర్లు ఎందుకు తగిలించాలి? అయినా అలాంటి మోరల్ ఫిలింగ్స్ ఒకప్పటి పరిణామం చెందని మన తాత ముత్తాతలైన కోతులకు ఉండేవి కావు కదా?

అయినా స్త్రీలు కూడా నిండుగా బట్టలెందుకు ధరించాలి. ఒకప్పుడు మన తాత ముత్తాతలైన కోతులకు సిగ్గు, నగ్నత్వం అంటేనే తెలిదు. అందుకే నిండుగా ఎవరైనా స్త్రీలు బట్టలు ధరిస్తే పట్టరాని ఇరిటేషన్..

ఏ ఇప్పుడు అలా చక్కగా కోతుల మాదిరిగా ఫ్రీగా ఉండలేమా? కోతుల్లా ఫ్రీగా ఎవరితో పడితే వారితో సెక్స్ చేసుకుంటూ.. మంచీ-చెడు, నైతికత-అనైతికత అనే బేధాలు చూడకుండా.. సృష్టికర్త పట్ల కలిగి ఉండాల్సిన భయాన్ని పనికిమాలిన బ్లడీ రిలిజియస్ సెంటిమెంట్స్ క్రింద జమకట్టేహేసి ఏ భయం బాధ్యతలూ లేకుండా, నీతి-న్యాయం అనే పేరామీటర్స్ లేకుండా లాజిక్ లేని పనికిమాలిన లాజిక్కులు చెప్పుకుంటూ మెదడును మోకల్లో పెట్టేసి హ్యాపీగా ఒకప్పటి మన పెద్దలైన కోతుల మాదిరి బ్రతకలేమా?
******

కానీ ఒక చిన్న సందేహం… మనిషి భౌతిక శరీరం, కోతి జాతుల నుండి పరిణామం చెంది పైగా స్త్రీ, పురుషులనే రెండు విభిన్న భావాలున్న మనిషులుగా రూపాంతరం చెందారని చెప్పటానికి మానవ పుర్రెల్ని, కోతి పుర్రెల్నీ ప్రక్కప్రక్కన పెట్టి, వాటి ఆకృతులతో మ్యాచింగ్ చేసి “మనిషి ఒకప్పటి కోతి” అని డిక్లేర్ చేసుకోవటం వరకూ బాగానే ఉంది..
మనిషి భౌతిక శరీరాన్ని కోతి జాతులతో మ్యాచింగ్ చెయ్యటం వరకూ కూడా ఒకే.. అయితే అతనిలో మంచీ-చెడుల మధ్య విచక్షణ చెయ్యగలగటం, అవసరమైతే మంచి లేదా చెడు ప్రకారం ప్రవర్తించగలగటం.. ఇంకా నీతి-న్యాయం, నైతికత-అనైతికత, స్వార్థం-నిస్వార్థం, త్యాగం, సిగ్గూ-అశ్లీలతా వగైరా ఒకప్పటి ఆటవిక కోతి జాతుల్లోనే కాదు భూమిపై ఏ జీవిలోనూ లేని ఈ అద్వితీయ లక్షణాలు (Unique qualities) మనుషుల మెదళ్లలోకి ఎలా వచ్చి చేరాయి?

భౌతిక శరీరం వరకు పోనీ కోతుల నుండి పరిణామం చెందిందని డిక్లేర్ చేసుకుంటే.. మరి, భూమిపై ఏ జీవికీ లేని ఒక్క మనిషికి మాత్రమే ఉన్న పై ప్రత్యేక లక్షణాలు కూడా గాలివాటంగా అతని మెదడులో వచ్చి చేరిపోయాయని సింపుల్ గా అనేసుకుంటేనే బెటారా?
******

ఇదిగో.. ఇప్పుడు మీరు ఇలాంటి లాజిక్కులు చెప్పి మమ్మల్ని కన్ఫ్యూస్ చెయ్యకండి.. మీరు ఎన్ని లాజిక్కులు చెప్పినా మేము వాటిని సిల్లీగా తీసుకుంటాం అంతే! మంచీ-చెడు, నైతిక ప్రవర్తన-న్యాయం వగైరా లక్షణాలు కూడా ఒకప్పుడు అడవుల్లో ఉండే కోతుల నుండే కాలక్రమేణా పరిణామం చెందుతూ వచ్చాయని ఫిక్స్ అయిపోండి అంతే.. అయినా ఏ సృష్టికర్తా లేడు ఆయన ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదని, మనుషులంతా ఒకప్పటి కోతులని డిసైడ్ అయిపోయాక ఇంకా మంచీ-చెడు ఏంది? నైతికత-న్యాయం ఏంది? అవన్నీ ప్రక్కన పెట్టేసి మల్లా కోతుల్లా ప్రవర్తించినా చీకట్లో ఎన్ని డ్యాన్సులు కట్టినా మా పనులకు లెక్క తీసుకునేదెవరు? దాని ఆధారంగా శిక్షా-బహుమానాలు ఇచ్చేదెవరు?
ఇలా బేవార్స్ గా ఫీలవటమే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తెలుసా!
ఇలాంటి పనికిమాలిన లాజిక్ లు, ఆలోచనలూ ప్రక్కన పెట్టేసి.. మనమంతా ఒకప్పటి కోతులమని డిక్లేర్ చేసుకుని.. హ్యాపీగా కోతుల్లా బతికేయాలి.. సృష్టికర్తా, మంచీ-చెడు, నీతి-న్యాయం లాంటి మాటలు మాట్లాడేవారిని పక్కా ఆజ్ఞానులుగా మూర్ఖులుగా జమకట్టేహేసి చేతనైనన్ని విమర్శలు చెయ్యాలి. ఇదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తెలుసా..
******

మనుషులంతా ఒకప్పటి కోతులే అని డిక్లేర్ చేసేసుకున్న గౌరవనీయులైన ఆధునిక పరిణామ కోతిజాతి పెద్దలందరికీ ఈ ఆర్టికల్ అంకితం.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *