ఒక అందమైన చిత్రాన్ని గీయాలనుకున్నప్పుడు కొన్ని రంగుల్ని తెల్ల కాగితంపై విసిరేస్తే యాదృచ్ఛికంగా అందమైన చిత్రం తయారైపోదు..
ఎంతో మేధాశక్తినీ, నైపుణ్యాన్ని ఉపయోగించాలి.. ఒక క్రమబద్ధత (Discipline) పాటించాలి.. రంగుల మధ్య సమతుల్యత (Balance) పాటించాలి.. అర్థవంతమైన రూపు రేఖలనివ్వాలి.. వాటి మధ్య నిర్దిష్టమైన కొలతలు ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఒక అందమైన కళాఖండం ఏర్పడుతుంది.
అచ్చం ఈ సమస్త సృష్టి కూడా ఎంతో క్రమబద్ధతతో, నైపుణ్యతతో పటిష్టమైన సమతుల్యతతో, నిర్ధిష్టమైన కొలతలతో ఓ మహత్తరమైన రూపకర్త “మేధ” ద్వారా ఓ మహా నిపుణుడైన సృష్టికర్త ద్వారా రూపుదిద్దబడి ఉనికిలోకొచ్చిందే!
ఒక అందమైన కళాఖండం ఏ చిత్రకారుడూ లేకుండానే దానికదే ఏర్పడిపోయిందని చెప్పటం ఎంత అజ్ఞానమో.. ఎంతో అందమైన మనోహరమైన ఈ సృష్టికి ఏ రూపకర్తా లేడు ఏ సృష్టికర్తా లేకుండానే ఈ సృష్టి ఉనికిలోకి వచ్చేసిందని చెప్పటం కూడా అంతే అజ్ఞానమవుతుంది.
గొప్ప టెక్నాలజీతో కూడిన ఒక వస్తువు/యంత్రం వెనుక ఒక నిపుణుడైన సృష్టికర్త ఉన్నప్పుడు.. మనిషి జ్ఞానపరిధికి, అంచనాలకు సైతం అందని గొప్ప టెక్నాలజీతో పనిచేస్తున్న ఈ విశ్వ ఆవిర్భావం వెనుక మహా నిపుణుడైన సృష్టికర్త లేడని చెప్పటం సాధ్యమేనా?
నిజానికి ఈ మహత్తర సృష్టిని ఉనికిలోకి తెచ్చిన…
“ఆయన మహా నిపుణుడైన సృష్టికర్త” – ఖురాన్ 36:81
ఏ రూపకర్తా లేడా.. ?
