ఎవరికి నచ్చినట్లు వారు ఉండాలని ఖాళీ సమయాల్లో పనికిమాలిన ఫిలాసఫీలు చెబుతూనే.. వృధ్యాప్యంలో కూడా నైతిక విలువలను బోధించే ధార్మిక గ్రంథం ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తూ కడు పేదరికంలో ఉన్నప్పటికీ తమకు నచ్చినట్టు విలువలతో కూడిన జీవితం గడుపుతూ ఉంటే అలా ఉండకూడదు, అది చదవకూడదని బేవార్స్ సూత్రాలు చెబుతూ కొందరు నాస్తికోన్మాదులు ఈ విధంగా పోస్టులు పెడుతూ శునకానందం పొందటం ఓ వెరైటీ అన్న మాట!
మత పుస్తకాలు చదవటం వల్లే పేదరికంలో, దుఃఖంలో ఉండటం ఎంటో!? బహుశా అలాగని ఈ నాస్తికుల సిలబస్ లో గానీ అలా రాసుకున్నారో ఏమో అర్థం కావటం లేదు.
ఒకవేళ అదే నిజమైతే ప్రపంచంలో ఖురాన్ చదువుతున్న 1.8 బిలియన్ల ముస్లిములూ, వారు నివసించే ముస్లిం-ఇతర అరబ్ దేశాలు పేదరికంలో, దుఃఖంలో మగ్గుతూ ఉండాలి! అంతే కాదు బైబిల్ చదువుతున్న 2.2 బిలియన్ల క్రైస్తవులు, క్రైస్తవ దేశాలైన యూరప్, అగ్రరాజ్యాలు పేదరికంలో, దుఃఖంలో ఉండాలి. ఇతర మత గ్రంథాలు చదువుతున్న ప్రజలందరూ కడు పేదరికంలో, దుఃఖంలో జీవితం గడుపుతూ ఒక్క నాస్తికులు మాత్రమే సకల భోగ భాగ్యాలూ, అష్టైశ్వర్యాలతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి.
నిజానికి ప్రపంచంలో పేదరికం, దుఃఖం తొలగిపోవాలని ఏ మతస్తుడూ తన వద్ద ఉన్న మత గ్రంథాలను చదువడు. ఏ మత గ్రంథమూ ఇది చదివినోళ్ల పేదరికం, దుఃఖం తొలగిపోతుందని చెప్పదు. ఆ విషయం ఈ నాస్తికోన్మాదులకు తెలీదు.
ఆర్.ఎస్.ఎస్, భజరంగ్ దళ్ లాంటి సంస్థలను, హిందూత్వాన్ని విమర్శిస్తూ హిందూ వ్యతిరేకులన్న ముద్ర పడకుండా బ్యాలన్స్ చేసుకోటానికి కాళిగా ఉండి ఏం చెయ్యాలో తోచక ఇస్లాంను విమర్శిస్తూ ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెడుతూ నాస్తికోన్మాదం ప్రదర్శిస్తే నాస్తికులు చదవాల్సిన గ్రంథం ఒకటి ఉంది.. దానిపేరే “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం”.
అదేమి చెబుతుందంటే… ఒక్క 20 వ శతాబ్దంలోనే కమ్యూనిస్ట్ రాజ్యాలైన రష్యా మరియు చైనాల్లో జరిగిన జనహననాల్లో దాదాపు 100 మిలియన్ల మంది చంపబడి ఎన్నో కుటుంబాలను పేదరికంలో, దుఃఖంలో నెట్టేశాయని.
నాస్తిక దేశాల్లో జరిగిన ఈ దౌర్జన్యాలకు కారకులు ఎవరో మత ఉన్మాదులు కారు స్టాలిన్, లెనిన్, మావో, పోల్ పాట్ వగైరా నాస్తిక లీడర్లే!
చరిత్రలో అతిపెద్ద జనహననాలు సాగించిన హిట్లర్, సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ల కంటే ‘మావో’ అధిగమించాడు. 1958 – 62 సం.ల మధ్య మావో జెడాంగ్ ప్రవేశ పెట్టిన “గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పాలసీ” కారణంగా చైనాలో 45 మిలియన్ల మంది చంపబడ్డారన్న విషయం ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెడుతూ శునకానందం పొందే ఎంత మంది నాస్తికోన్మాదులకు తెలుసు?
ఇదో కరుడుకట్టిన శునకానందం!
