ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు

  • Home
  • భార్యతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలి

భార్యతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలి

ఇస్లాం, తలిదండ్రుల నుండి బంధువులు, ఇరుగుపొరుగువారు, మిత్రులు, బాటసారుల వరకు ప్రతి ఒక్కరితో ఉదార బుద్ధితో వ్యవహరించమనటమే కాక, ఇంట్లో భార్యతో సైతం ఉత్తమ రీతిలో వ్యవహరించాలని ఆదేశిస్తుంది. అసలు ఖురాన్ పురుషులకు తమ భార్యలతో వ్యవహరించే విషయంలో చెబుతున్నది ఏమిటంటే:…

తోటివారిని ఎగతాళి చెయ్యకూడదు    

ఇతరుల విషయంలో చాలా మంది స్త్రీ, పురుషులు చేసే తప్పు ఏమిటంటే… తోటివారిని ఎగతాళి చేస్తూ వెటకారంగా, అగౌరవంగా మాట్లాడటం. అలా మాట్లాడటాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. అంతేకాదు, తోటి వారు నచ్చకపోతే… వారికి కొన్ని చెడ్డ పేర్లు తగిలించి వెటకారం చెయ్యకూడదు.…

ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు

న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్నీ హతమార్చకూడదు అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకటి. ఖురాన్ అవగాహన లేని చాలా మంది తమకున్న అర్థజ్ఞానంతో “ఖురాన్ ముస్లిమేతరులను చంపమని చెబుతుంది, హింసను ప్రేరేపిస్తుంది” “ఇస్లాం ఖడ్గంతో వ్యాపించింది” అన్న అజ్ఞానపు మాటలు…

మీ సంతానాన్ని హత్య చేయకండి  

ప్రస్తుత సమకాలీన సమాజంలో తమ తలిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేసే సంతానంతో పాటు, పేదరికానికి భయపడి తమ సంతానాన్ని చంపేసే తలిదండ్రులకు సైతం కొదవలేదు. అందుకే ఇస్లాం ఒకప్రక్క “మీ తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి” అని వారి సంతానాన్ని ఆదేశిస్తూనే……

తలిదండ్రులను విసుక్కోకండి

ఖురాన్ లో అనేక వాక్యాల్లో “మీరు ఒక్క సర్వేశ్వరుడైన దేవుణ్ణి తప్ప ఎవర్నీ ఆరాధించకూడదు” అని ఆదేశిస్తూనే “మీ తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి” అన్న రెండవ ఆదేశాన్ని సైతం కలిపి చెబుతునట్టు గమనించగలం. దీనిని బట్టి తలిదండ్రులతో మంచిగా ప్రవర్తించటాన్ని ఇస్లాం…

పొరుగువారితో ఉదార బుద్ధితో వ్యవహరించాలి

మిత్రులు, పొరుగున ఉన్న బంధువులతోనే కాదు అపరిచితులైన పొరుగువారు అంటే వారు ఏ మతానికి, కులానికి చెందినవారైనా, వారితో మనకు ముందెన్నడూ పరిచయం లేకపోయినా సరే, వారితో ఉదార బుద్ధితో వ్యవహరించాలన్నది ఇస్లాం నేర్పే నైతిక విలువల్లో అతి పెద్ద అంశం.…

మంచి పనులు చెయ్యటంలో పోటీ పడండి  

ఇస్లాం కేవలం మంచి పనులు చెయ్యండి అని మాత్రమే చెప్పటం లేదు మంచి పనులు చేసే విషయంలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించ మంటుంది. అంటే ఇతరులు మంచి పనులు చేస్తుంటే ఈర్ష్య (Jealous) పడేకంటే, వారికంటే ఎక్కువగా మంచి పనులు చేసే…

అహంకారం

విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాల కలయికే ధర్మం. కాబట్టే ఇస్లాం తోటి వ్యక్తులతో నడిపే వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడటం అంటే ముఖం చిట్లించుకుని గర్వంతో మాట్లాడటం. ఒక వ్యక్తి మనసులో ఎంతో అహంకారం, గర్వం,…

ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నది ఓ పాతకాలం సామెత. ఇదే విషయాన్ని ఎంతో కాలం ముందే ఖురాన్ “ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి” అని ఆదేశించటం జరిగింది. తోటి వ్యక్తులతో సానుకూలమైన సంబంధాలు కొనసాగటానికి మర్యాదపూర్వకమైన “నోటి మాట” అత్యంత అవసరం. మన…

చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించాలి   

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా చెడును చెడు ద్వారానే తొలగించమని ఇస్లాం చెప్పటం లేదు, కానీ- “చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించమని చెబుతుంది. అంటే మనపట్ల చెడు తలపెట్టాలని చూసే శత్రువుల పట్ల సైతం శ్రేష్ఠమైన మంచితోనే వ్యవహరించాలన్నది ఇస్లాం నేర్పుతున్న…