ఇస్లాం నేర్పే నైతిక విలువలలో అతి ప్రధానమైన విషయాలు ఏమిటంటే- మనిషి మృదుత్వం, ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగే వైఖరిని అవలంబించాలి. అంతేకాదు, మంచి విషయాలనే చెబుతూ ఉండాలి. అంతేకాదు, మూర్ఖులు ఎదురైనప్పుడు మన మాటే నేగ్గాలన్న పంతానికి పోయి వారితో వాదానికి…
ఇస్లాం నేర్పే నైతిక విలువలలో మరొక గొప్ప అంశం మంచికీ, దైవభక్తికీ సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించాలి. అంటే మంచి పనులు చేసేవారు ఏ మతానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ వారు చేసే మంచి పనులలో వారితో…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒక ముఖ్యమైన విషయం మనిషి జాత్యాహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదు అన్నది. ఇస్లాం ‘మంచివారు-చెడ్డవారు’, ‘విశ్వాసులు-అవిశ్వాసులు’ అంటూ వ్యక్తుల ప్రవర్తన ఆధారంగా మాత్రమే మనుషులను వర్గీకరిస్తుంది తప్ప వారి వాంశాన్ని బట్టో, జాతిని బట్టో, వర్గాన్ని…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో మరోక ప్రధానమైన విషయం ఏమిటంటే- మనిషి కష్టకాలంలోనూ, సంతోష సమయాల్లోనూ ఎలాంటి సందర్భాల్లోనూ మత్తు పదార్థాల జోలికి పోకూడదు అన్నది. అంతేకాదు అతను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి తప్ప, జూదం జోలికి పోకూడదు. మనిషిని…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువల్లో ఒకానొక ప్రాధానమైన విషయం ఏమిటంటే- మనిషి గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు కాక, అతను భౌతిక జీవనంలో ఏ రంగంలోనైనా విజయం సాధించటానికి కచ్చితంగా పరిశ్రమించాలి అన్నది. నాస్తికులు భావించేదేమిటంటే.. ధర్మం…
ఇస్లాం ఎలాంటి ఉన్నత నైతిక విలువలు నేర్పుతుందంటే… ఇంట్లో తలిదండ్రులు ముసలివారై ఉంటే వారిని కనీసం ‘ఛీ’ అని సైతం కసుకోవద్దని, బంధువులు, అపరిచితులైన పొరుగువారు, దాసదాసీ జనంతో, బీదలతో ఉదారబుద్ధితో వ్యవహరించమనటమే కాదు, చివరకు అనాథులు, మన ముందు నిలబడి…
ఇస్లాం వ్యక్తుల మధ్య సత్సంబంధాలతో కూడిన శాంతియుతమైన మరియు సుందర సమాజం నిర్మించబడాలని అభిలషిస్తుంది. అలాంటి ఉన్నత సమాజం నిర్మించబడాలంటే వ్యక్తులలో ఉత్తమోత్తమ నైతిక విలువలు ఉండటం అత్యంత ఆవశ్యకం. అందుకే ఖురాన్ అపరిచితులైన పొరుగువారితో, బంధువులతో, ప్రక్కనున్న మిత్రులతో, దాసదాసీ…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే… ఇస్లాం కేవలం అశ్లీలపు పనులు చెయ్యకండి అని మాత్రమే చెప్పి ఊరుకోవటం లేదు. కానీ, అసలు అశ్లీల విషయాల దరిదాపులకు కూడా పోకండి అని చెబుతుంది, పైగా అవి బహిరంగమైనవైనా…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో అత్యంత ప్రధానమైన విషయం ఇతరుల విషయంలో అతిగా అనుమానించకూడదు, కొందరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలలో గూఢచారులుగా వ్యవహరించకూడదు. వారి రహాస్యాలను తెలుసుకుని వారి గురించి ఇతరుల ముందు లేనిపోనివి తగిలించి చాడీలు అస్సలు చెప్పకూడదు.…
ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో ఒకటి మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనూ పలికితే న్యాయమే పలకాలి అన్నది. చివరకు వ్యవహారం మన దగ్గర బంధువులకు సంబంధించి నదైనా సరే. పైగా దైవాన్ని నమ్ముకునే విశ్వాసులకైతే ఈ విషయాన్ని ఖురాన్ మరొక చోట ఇంకా…